సిరాన్యూస్, ఆదిలాబాద్
పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాల్సిందే: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* రైతు బాధితులకు మద్దతుగా ఎమ్మెల్యే ఆందోళన
రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి, ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ మోసగిస్తుందని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆరోపించారు. మంగళవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతు బాధితులను కలిసి వారి ఆందోళనకు మద్దతు పలికారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1500 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ కేవలం బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల 220 మందికి మాత్రమే రుణమాఫీ జరగడం దారుణం అన్నారు. ఫిర్యాదులు స్వీకరించి ఆన్లైన్లో దరఖాస్తులకు కూడా రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లకి రుణమాఫీ చేయడం శోచనీయం అన్నారు. కొందరికి 50,000 మరికొందరికి 1,50000, మరో కొందరికి రెండు లక్షల రుణమాఫీ జరగకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రుణమాఫీలో లోసగులను ప్రభుత్వం సరిదిద్దాలని, అరులైన వారందరికీ రెండు లక్షల రుణమాఫీ ముందుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు నిబంధనలు సడలించి రైతుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బ్యాంక్ సిబ్బందిని వివరాలు అడిగి రుణమాఫీపై ప్రకటన జారీ చేయాలని సూచించారు. వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు సంతోష్, దయాకర్, అకుల ప్రవీణ్, రాందాస్, ముకుంద్, దత్తు, నరేష్ , అనిల్, ఆదినాథ్, సుభాష్, రాజూ తదితరులు రైతులు పాల్గొన్నారు.