సిరాన్యూస్, ఆదిలాబాద్
బాలికల వసతి గృహాలను సందర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
వసతి గృహాలకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అలా లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ, ఎస్సీ, బాలికల వసతి గృహాలను ఎమ్మెల్యే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులలో కలిసి భోజనం చేశారు.న్యాయమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెస్ చార్జ్ లను పెంచాలన్నారు. వసతిగృహాల సమస్యలపై ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్ , రత్నాకర్ రెడ్డి, అశోక రెడ్డి, శ్రీనివాస్, అర్జున్, సంతోష్, దశరథ్ పటేల్, మహేందర్ తదితరులు ఉన్నారు.