సిరాన్యూస్, ఆదిలాబాద్
ఇస్కాన్ టెంపుల్‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
*ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి తమ జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలని భగవద్గీత ఉందన్నారు. గతంలో కేవలం కొన్ని దేశాల్లోనే పరిమితమైన శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నేడు యావత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వేడుకలు జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు చాలా గొప్పవి అన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా హిందూ సోదరులు వేడుకలు పాల్గొన్నారన్నారు . మనమంత కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఆ ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.