సిరాన్యూస్, ఆదిలాబాద్
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* బీసీ బాలుర వసతి గృహాన్నిసందర్శన
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల బీసీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువులు వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దోమల బెడద లేకుండా పారిశుద్ధ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వార్డెన్ కు సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఇచ్చారు. ఆ తర్వాత వంటగదిని పరిశీలించి హాస్టల్ మెనూ వివరాలు అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స బియ్యం సరిగ్గా లేదని , పాత బియ్యం బాగుందని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ సంక్షేమ అధికారి ఎం శివకుమార్ , సిబ్బంది పాల్గొన్నారు.