సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎమ్మెల్యే పాయల్ శంకర్ హౌస్ అరెస్ట్
* నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
జైనూర్ లో ఆదివాసీ మహిళను అత్యాచారం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను స్పందించే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత రాష్ట్రంలో జరిగిన ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. జైనూరు ఘటనలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పోతున్న తనను హౌస్ అరెస్టు చేయడం తగదన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని శిక్ష పడేలా చూడాలన్నారు. జైనూర్ లో రోహిన్యాలు, బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ నుండి వస్తున్నారు పోలీసుల దర్యాప్తు చేయాల న్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి తామ అప్రమత్తం చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించింది అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మాటలు ఓ వర్గానికి లోబడి మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు తెలుసుకునే ఇంటలిజెన్స్ పోలీసు వ్యవస్థ ఆదివాసుల పై ఇలాంటి ఘటనలు జరుగుతున్న ముందస్తు తెలుసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. వీరితోపాటు బీజేపీ నాయకులు రఘుపతి లాలామన్న, జోగు రవి, సోమరవి, ఆకుల ప్రవీణ్, దినేష్ మటోలియా, శ్రీనివాస్, సూర్యకిరణ్, అశోక్ రెడ్డి , శివ, రాజు, విశాల్ , అనిల్ తదితరులు ఉన్నారు.