సిరాన్యూస్,ఆదిలాబాద్
హిందీ భాష అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* ఆదిలాబాద్‌లో హిందీ దివాస్ వేడుకలు
హిందీ భాష అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో హిందీ దివాస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాష ప్రాముఖ్యతను వారు తెలియజేశారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ హిందీ భాష వచ్చినవారు దేశంలో ఎక్కడైనా స్థిరపడ వచ్చన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధికి శివరాం , ప్రకాష్ గౌడ్ ఎనలేని సేవలు చేశారని అన్నారు. హిందీ భాష అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, డీఎస్పీ జీవన్ రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖాత్రి, ప్రముఖ వ్యాపారవేత భజరంగ్ అగ్రవాల్, హిందీ భాషా సేవాసమితి జిల్లా అధ్యక్షుడు సుకుమార్ తదితరులు ఉన్నారు.