MLA Payal Shankar: గరీబోళ్ల ఇళ్లను కూల్చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
గరీబోళ్ల ఇళ్లను కూల్చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* హైడ్రా పేరుతో ప్రజలను ఆందోళన గురి చేస్తున్నారు
* ఖానాపూర్ ప్రజలకు అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరుతో పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆందోళన గురి చేస్తున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం హైడ్రా పేరుతో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ చెరువు కట్ట సమీపంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాలనీ వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. కాలనీవాసులు తమ బాధను గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఖానాపూర్ సమీపంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని, మంజూరు చేస్తూ వారికి పత్రాలు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు మళ్ళీ ఇదే ప్రభుత్వం తాము కట్టుకున్న ఇళ్లను కూలగొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నేడు అధికారులు వచ్చి మీరు కట్టుకున్న ఇల్లు ఎఫ్డిఎల్లో, బఫర్ జోన్ లో ఉందని చెబుతున్నారన్నారు. 60, 70 ఏళ్ల నుంచి అక్కడే కూలినాలి చేస్తూ కట్టుకునే ఇండ్లనే కూల్చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామంటూ చెబుతూనే. మరో పక్క హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లను కూలగొడుతున్నారన్నారు. చెరువులలో పెద్ద పెద్ద బడా బాబులు ఎవరైనా అక్రమంగా ఇండ్లు కట్టుకుని ఉంటే ముందుగా వాళ్ళని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. పేదవాళ్ల దగ్గరే కీ మీ కానున్ చూపిస్తారా..? ప్రతి నియోజకవర్గానికి ఇండ్లను కట్టిస్తామని చెప్పడం మరోపక్క ఇళ్ళను కూల్చేయడం ఇదేనా ప్రభుత్వ పాలన అన్నారు. ప్రభుత్వం గరీబోళ్లకు ఇల్లు కట్టి వాళ్లే కానీ కట్టుకున్న ఇండ్లను కూల్ చేయడం సరైన పద్ధతి కాదన్నాడు. మున్సిపాలిటీ వాళ్లు రోడ్లు వేశారు, నానీలు కట్టారు, విద్యుత్ శాఖ అధికారులు వీధి దీపాలు కరెంటు పోల్లు తోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది.. గడిచిన తొమ్మిది నెలలు ఏం చేయలేదు. ఇప్పుడేం చేస్తున్నారు.భవిష్యత్తులో ఏం చేయదలచుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారులు కొలిపుర ఖానాపూర్ కి వచ్చి ప్రజల్ని భయాందోళన గురి చేయడంతో కాలనీవాసులకు ఒకరుకో ఇద్దరుకో గుండెపోటు వచ్చిన విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.కార్యక్రమంలో లాలమన్న., ఆకుల ప్రవీణ్ , జోగు రవి కృష్ణారెడ్డి , అశోక్ రెడ్డి,  రాజేష్ శ్రీనివాస్, కృష్ణ యాదవ్,  రాజేష్,  అర్జున్, సతీష్ విజయ్,  భీమ్ సన్ రెడ్డి , మల్లు తదితులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *