ఆదిలాబాద్, సిరా న్యూస్
సీసీఐ రామాలయంలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
అన్ని ఆలయాలను దీపాలతో వెలిగించాలని పిలుపు
అయోధ్యలో రామాజన్మ భూమి బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్బంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ లోని అతి పురాతనమైన సీసీఐలోని రామాలయంలో శ్రమదానం చేశారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక రాజకీయ పార్టీలు పట్టణంలోని వివిధ ఆలయాల్లో స్వచ్ఛంధంగా భక్తులు అన్నదాన కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవాలు అభిషేకాలు 22వ తేదీన జరుపుకోవాలన్నారు. సీసీఐలోని రామాలయం దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిందన్నారు. హిందువులంతా ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ రోజు భక్తులు అందరు ఇంట్లో రాముడిని కొలిచి తమ మద్దతు తెలియజేయాలన్నారు. ఎన్నో విశిష్గతలు కలిగి ఉన్న సీసీఐలోని రామాలయం కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు