MLA Payal Shankar Camp Office: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు…

ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు కార్యాలయంలో హోమాధి కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది. కాగా పంచ కట్టు, సాంప్రదాయ దుస్తుల్లో ఎమ్మెల్యే తన సతీమణితో కలిసి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఇతర బిజెపి నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి పూల బొకేలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *