సిరా న్యూస్ నిర్మల్:
అమ్మవారి సేవలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్…
+ వసంత పంచమి పర్వదినాన ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని సందర్శించారు. బుధవారం వసంత పంచమి మహోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అమ్మవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు బీజీపీ నాయకులు, భక్తులు ఉన్నారు.