MLA Sigudu Vamsikrishna: కలెక్టర్, అధికారులపై దాడి అమానుషం :ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
కలెక్టర్, అధికారులపై దాడి అమానుషం :ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
* ఇది ముమ్మాటికీ మాజీ సీఎం, మంత్రులు,ఎమ్మెల్యేల పనే

యువతకు ఉపాధి కల్పించాలని మహోన్నతమైన లక్ష్యంతో ప్రజల అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అదనపు కలెక్టర్, తాసిల్దార్ లపై జరిగిన దాడి ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డిల పనే అని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు బయలుదేరుతున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే చెక్కుల రాజేష్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ని ఓ గ్రామంలో యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఓ ఫార్మసిస్ట్ కంపెనీ ఏర్పాటు విషయం స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డిఓ, తహసీల్దార్ ల పై దాడికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే పని అని ఆరోపించారు. అయితే దీని వెనక ఎవరున్నారు దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు అనేది పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులకు సహకరించాల్సిన క్రమంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బి.ఆర్.ఎస్ నాయకులు గ్రామస్తుల ముసుగులో దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. అధికారులపై దాడి చేయడం సమంజసం కాదని ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని మండిపడ్డారు. భవిష్యత్తులో స్థానికంగా యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, వ్యతిరేకతతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు ,బి ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు దిగజారుడు తనంతో ఇటువంటి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇప్పటికే చర్యలు తీసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారని అన్నారు అయితే దాడికి పాల్పడినటువంటి వ్యక్తి బి.ఆర్.ఎస్ కార్యకర్త అని పోలీసులు గుర్తించినట్లు తెలియజేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి స్థానిక మాజీ ఎమ్మెల్యేతో 40 సార్లు ఫోన్లో సంభాషించారని, ఆయన మాజీ మంత్రి కేటీఆర్ తో ఒక 20 సార్లు ఈ చర్యకు ముందు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని పేర్కొన్నారు.ఏది ఏమైనా బి ఆర్ ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలకు వెళ్లి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం సిగ్గుచేటని అన్నారు. దీనినీ తీవ్ర పరిణామంగా తీసుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకునే విధంగా చూస్తామని అన్నారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు లోకా ప్రవీణ్ రెడ్డి, నాయకులు గిరివర్ధన్ గౌడు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *