MLA Surendra Babu: ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
* రూ.3లక్షల విలువ చేసే చెక్కులు అంద‌జేత

ఆపదలో ఉన్న అబాగ్యులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అమోఘమ‌ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమ‌వారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పుట్టినరోజు సందర్బంగా 11మంది బాధితులకు రూ.3లక్షలు విలువ చేసే చెక్కులను ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో విద్య, వైద్యం అందక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది అబాగ్యులకు అండగా నిలబడడం చాలా సంతోషకరమన్నారు.ఇన్ఫినిటీ చారిటబుల్ మరింతగా అభివృద్ధి చెందాలని, వారికి నా సహకార కూడా అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమం మండల కన్వీనర్ గోళ్ళ వెంకటేశ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *