MLA Surendra Babu: విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే సురేంద్ర బాబు దిగ్బ్రాంతి

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే సురేంద్ర బాబు దిగ్బ్రాంతి
* కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి తేజ అనంతపురం జూనియర్ కళాశాల హాస్టల్ లో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు స్పందించారు. విద్యార్థి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. రేపు ఉదయాన్నే అనంతపురం ప్రభుత్వ అస్పత్రిలో గల విద్యార్థి భౌతికయాన్నిసందర్శించు నున్నారు. అలాగే మృతికి గల కారణాలను ఆరా తీయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *