సిరాన్యూస్, కుందుర్పి
వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ. లక్ష అందజేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి శనివారం ఎమ్మెల్యే సురేంద్రబాబు రూ.లక్ష విరాళం అందజేశారు .అలాగే బెస్తరపల్లి గ్రామానికి ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ ఇచ్చినందుకు మాజీ సర్పంచ్ రాఘవేంద్రబాబు,మాజీ కో-ఆప్షన్ నెంబర్ తాయిర్ బాషా,డీలర్లు ఓబనాయక్,లక్ష్మణమూర్తిలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పిహెచ్ స్కూల్, ఎంపీపీ స్కూల్ చైర్మన్లు రామాంజినేయులు, హేమలత అనిమేటర్ ఎర్రచలపతి, ఫీల్డ్ అసిస్టెంట్ అంజి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.