సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఒకే కుటుంబానికి రూ. 40వేల పెన్షన్ అందజేత : ఎమ్మెల్యే సురేంద్ర బాబు
కళ్యాణదుర్గం మండలo బోరంపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు హాజరయ్యారు. ఈసందర్బంగా ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు, కార్యకర్తలు అధికారులు స్వాగతం పలికారు. అనంరతం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి మొక్కుకున్నారు. అనంతరం గ్రామమలోని బి ఎర్రిస్వామి గృహానికి వెళ్లి ఆ కుటుంబానికి ఆసరా పింఛన్ కింద రూ. 40వేల అందజేశారు. ఆ సమయంలో ఆ కుటుంబం ఆనంద బాష్పలతో కృతజ్ఞతలు తెలిపారు. మీరు మా ఇంటికి రావడం మాకు సంతోదాయకమన్నారు.