సిరా న్యూస్, కళ్యాణదుర్గం
అభయ ఫౌండేషన్‌కు తన నెల వేతనాన్ని అందజేసిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కళ్యాణదుర్గం యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు మార్కెట్ యార్డులో అభయ ఫౌండేషన్ వారికి తన మొదటి నెల వేతనాన్నిఎమ్మెల్యే సురేంద్ర బాబు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో బుధవారం ఎమ్మెల్యే మేనల్లుడు దేవినేని ధర్మతేజ అభయ ఫౌండేషన్ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్బంగా ధర్మతేజ మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డ్రైవింగ్, టైలరింగ్, మొబైల్ రిపేరి, బ్యూటిషిన్, థెరపిస్ట్ మొదలగు వాటిలో వారికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 100 మందికి శిక్షణ ప్రారంభించామని శిక్షణ తీసుకున్న వారు శృద్దగా నేర్చుకుని స్వయం ఉపాధి పొందాలన్నారు.