సిరా న్యూస్,కుందుర్పి
కుందుర్పిలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
* పెంచిన పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని
* పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ
* ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పింఛన్ దారులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సోమవారం ఉదయం నుంచి పెంచిన పింఛన్ లను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు పింఛన్ దారులకు అందజేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబగుంపుల, బెస్తరపల్లి గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్లు, బీటీపీ కాలువతో పాటు కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.