సిరాన్యూస్,కుందుర్పి
బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
కుందుర్పి మండలంలోని చెరువు కుంటలో పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. బుధవారం మృతి చెందిన విద్యార్థి విష్ణు, యువకుడు నవీన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.