సిరాన్యూస్, కుందుర్పి
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయవృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. బుధవారం కుందుర్పి మండల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులు ఎం. కిష్టప్ప పదవి విరమణ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హాజరై మాట్లాడారు. కుందుర్పి జెడ్పి ఉన్నత పాఠశాలలో వాలీబాల్ ఆడటానికి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రధానమైనదని, అలాంటి వృత్తిలో పదవి విరణమచేయడం చాలా గొప్ప విషయమన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎం. కిష్టప్పను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మోరెపల్లి మల్లికార్జున, కుందుర్పి మండల కన్వీనర్ ధనుంజయ, నాయకులు ధర్మతేజ, కుందుర్పి మండల నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.