MLA Surendra Babu: బీటీపీ పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తా: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

సిరాన్యూస్, కళ్యాణ్ దుర్గం
బీటీపీ పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తా: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
ఘ‌నంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పుట్టిన రోజు వేడుక‌లు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కళ్యాణదుర్గం ప్రాంత జీవనాడి అయిన బీటీపీ కాలువ పూర్తి చేసి రెండున్నరేళ్లలో నీళ్లు తీసుకువస్తానని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమ‌వారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు 58వ పుట్టిన రోజు వేడుక‌లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మ‌ధ్య‌ కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద నిర్వ‌హించారు. ఈ సందర్బంగా భారీ కేకు కట్ చేశారు.అక్కడే ఏర్పాటు చేసిన మరొక కేక్ మీద ఎస్సార్సీ కన్స్ట్రక్షన్ వారు రాష్ట్రంలో చేస్తున్న ప్రాజెక్టలతో, అసెంబ్లీ, అందులో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినట్లు, కళ్యాణదుర్గం జీవనాడి అయిన బీటీపీ కాలువ నమోనాలతో కూడిన కేకును ఎమ్మెల్యే కట్ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కళ్యాణదుర్గం ప్రాంత జీవనాడి అయిన బీటీపీ కాలువ పూర్తి చేసి రెండున్నరేళ్లలో నీళ్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు..ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారాని తప్పకుండా ఇచ్చి తీరుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *