సిరా న్యూస్,హైదరాబాద్;
యువత వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టడం వలన శరీరం దారుఢ్యంతో పాటు, మానసిక ఉల్లాసాన్ని కూడా పొందుతారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సనత్ నగర్ నియోజక వర్గం రాంగోపాల్ పేట్ చుట్టాల బస్తీ మేక్లోడ్ గూడ లో ఏర్పాటైన జిమ్ ను ఎమ్మెల్యే తలసాని ప్రారంభించారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ ఇక్కడి యంగ్ స్టార్స్ విజ్ఞప్తి మేరకు జిమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మైదానాన్ని పూర్తిగా ఇక్కడి ప్రజలు ఉపయోగించుకొనే విదంగా నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేయడం అవసరమని చెప్పారు. ఐతే ఒక కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ది జరిగితే పారదర్శకంగా ఉంటుందని అందుకోసం స్థానికుల భాగస్వామ్యంతో కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై సమాధానం చెప్పడానికి నిరాకరించారు.