సిరా న్యూస్ పెంబి
పలు పనుల ప్రారంభోత్సవం
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శెట్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో గతం లో భూకబ్జా చేసిన వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే నంబర్ 205 లో సర్యే చేసి ప్రభుత్వ భూమిని కబ్జా దారుల నుంచి తిరిగి భూమి స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు డబ్బులు వసూలు చేసిన నాయకులను విడిచి పెట్ట బోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు సల్ల స్వప్నేల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శతృఘ్నన్, న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి, తులాల శంకర్, అశోక్ రావు, గుగ్గిల్ల భూమేశ్, తోకల మహేందర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు