సిరాన్యూస్, ఉట్నూర్
పేదల అభివృద్ధికి పెద్ద పీటవేసిన బడ్జెట్ : ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్
సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ అన్నారు. గురువారం హైదరాబాద్లో మంత్రిని కలిసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ. ఎస్టీ, బడుగు వర్గాల,మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. రైతులు వ్యవసాయ రంగంలో నిలదొక్కుకొనే విధంగా రూపొందించిన ప్రజా ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు పేద ప్రజల జీవనప్రమాణల్లో మార్పులు తీసుకుస్తుందని అన్నారు. రుణ మాఫీ, రైతు భరోసా, రైతు భీమాకు కేటాయించిన నిధులు రైతుల్లో ఆనందాన్ని నింపిందన్నారు.పూటగడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇళ్లు కట్టుకోడానికి పేదలకు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది. ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.6లక్షల సహాయం అందించనుందని దీంతో గ్రామాల్లోకి పేదల స్వంత ఇంటి కలనెరవేరుతుందన్నారు. సాగునీటి రంగానికి బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేసి వాస్తవ బడ్జెట్ రూపొందించరన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఉన్నతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ధిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వెడ్మ భోజ్జు పటేల్ ధన్యవాదాలు తెలిపారు.