సిరా న్యూస్, పెంబి:
ఎమ్మేల్యే వెడ్మా బొజ్జు పటేల్ కు ఘన సన్మానం..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ను నాయకులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా పెంబి మండలానికి వచ్చిన ఆయన్ను కాంగ్రెస్ నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమిష్టి కృషి, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధ్యమైందని అన్నారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఖానాపూర్ నియోజకవర్గం ప్రజల ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ కార్యనిర్వాక అధ్యక్షులు భూపెల్లి శ్రీధర్ ను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంబి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సల్ల స్వప్నీల్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి, నాయకులు సాగే అశోక్ రావు, తులాల శంకర్, గుగ్గిళ భుమేశ్, తోకల, మహేందర్, మల్లేపల్లి స్వామి,శుబాష్, ఆదిలాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ యువత వేముల నాగరాజు, అయిండ్ల రంజిత్ రెడ్డి, మద్దుల గణేష్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.