సిరా న్యూస్, ఉట్నూర్:
నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా…
అన్ని వర్గాల్లోని నిరుపేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో టక్కుగూడా గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులకు రూ. 1లక్ష, బూచిలింగం కుటుంబ సభ్యులకు రూ. 2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ ఎల్ఓసి ల ద్వారా నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం ముందస్తుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా చికిత్సలు చేయించుకునే అవకాశం ఉందన్నారు. నిరుపేదలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని తాను అండగా ఉంటానని ఆయన అన్నారు.