సిరాన్యూస్, ఇంద్రవెల్లి
ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలం కు చెందిన కసు గోలవార్ రమేష్ ఆరోగ్య సమస్యలతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 2,50,000 రూపాయలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం అందజేశారు.ఈసందర్బంగా ఎల్ ఓ సి మంజూరు చేయించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.