సిరా న్యూస్, ఉట్నూర్
మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఈనెల 6న బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం బిగ్ టీవీ స్టాఫర్ సాయిలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిభిరానికి ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.ఈ వైద్య శిభిరం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అవుతుందని, ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.