సిరాన్యూస్,నిర్మల్
ప్రజా యుద్ధనౌక గద్దర్ కు నివాళులర్పించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
నిర్మల్ పట్టణంలోని టిఎన్జీవో గార్డెన్లో తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పాటనే తూటగా మలిచి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తు పేదల పక్షాన నిలబడి నిరంతరం పోరాడిన యుద్ధ వీరుడు గద్దర్ అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గద్దరన్న బాటలో నడవాలని పిలుపునీచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.