సిరాన్యూస్, జన్నారం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి పథకం వరమన్నారు. త్వరలో రూపాయి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.సీఎంఆర్ఎఫ్, పథకం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ సమయంలో రోగి చికిత్సకు అయ్యే ఖర్చును ఎల్ఓసి ద్వారా తక్షణమే నిధులను మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు , అభిమానులు, తదితరులు, పాల్గొన్నారు.