సిరాన్యూస్, ఉట్నూర్
ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయండి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఈనెల 9న హైదరాబాదులోని ఉస్మానియా క్యాంపస్,ఆదే విధంగా ఉట్నూర్ మండలంలోని కేబి కాంప్లెక్స్ పిఎంఆర్సి భవనంలో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు .గురువారం ఆదిలాబాద్ ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.హైదరాబాదుతో పాటు ఉట్నూరులో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆదివాసీలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలనీ కోరారు.ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా ఆదివాసీ దినోత్సవంతో పాటు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు.