MLA Vedma Bojju Patel: వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ 

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద అమృత్ స్కీం 2 కింద మంజూరు అయినటువంటి వాటర్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మాణానికి భూమి పూజ చేసి, శిలాఫలాకాన్నిఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ స్కీమ్ 2 కింద 22.50 కోట్ల రూపాయలతో ఖానాపూర్ పట్టణానికి రెండు వాటర్ ట్యాంకులు మంజూరు అయ్యాయని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ప్రజలు నీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని. ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మరియు వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు పరిమి సురేష్ , అమానుల్లా ఖాన్ , షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ ఈ చిత్రంలో ఇఇ గంగధర్ , మున్సిపాలిటీ ఏ ఈ, సంతోష్ జాదవ్ , మండల అధ్యక్షులు దొనికేనీ దయానంద్, మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, పి,ఎ,సి,ఎస్, చైర్మల్లు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ఆమంద శ్రీనివాస్, నాయకులు మ్యాధరి రాజేశ్వర్, నేరెళ్ల సత్యనారాయణ, సలీం ఖాన్,మాధవ్, గోవింద నాయక్, సచిన్, రాజేందర్, శేషాద్రి, రమేష్, మీర్జా, షారు, కార్యకర్తలు , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *