సిరాన్యూస్, ఉట్నూర్ :
చరిత్రను మరవోద్దు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు కవి,రచయితలు ఎనలేని కృషి చేస్తారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పిఎంఆర్సీ భవనంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైమన్ డార్ప్-బెట్టి ఎలిజిబేత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు హైమన్ డార్ప్ బెట్టి ఎలిజిబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ చేసిన కృషి అభినందనీయమన్నారు.ఇలాగే తన సేవలను పేద ప్రజల కోసం చేయాలన్నారు.ఆదివాసీలు వినియోగించిన,వినియోగిస్తున్న పని ముట్లు,డోలు వాయిద్యాలు,గోండు రాజ్యాల కట్టడాలు,పర్యాటక స్థలాల ఫోటోలను సేకరించి ప్రదర్శించడం పట్ల చరిత్ర భవితరాలకు తెలుస్తుందన్నారు. ఈ సందర్బంగా హైమన్ డార్ప్-బెట్టి ఎలిజిబెత్ గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ ను ఎమ్మెల్యే ప్రసంశించారు.