సిరాన్యూస్, ఖానాపూర్
చదువుతూ పాటు ఆటల్లో రాణించాలి: ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
* జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభం
* ఎమ్మెల్యేకు ఘన సన్మానం
విద్యార్థులు చదువుతూ పాటు ఆటల్లో రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల జడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ విద్యతో పాటు ఆటల పోటీలలో పాల్గొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. మనకు చదువు చెబుతున్న గురువులను, పెద్దలను గౌరవించాలని అన్నారు. బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు.చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్, యూనిఫామ్లను అందజేశారు. ఈసందర్భంగా పాఠశాల టీచర్స్ ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు, పాఠశాల టీచర్స్ విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.