సిరాన్యూస్, ఖానాపూర్
విద్యార్థులకు పదవ తరగతి పునాది లాంటిది: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేత
భవిష్యత్తులో మంచి ఉన్నత రంగాల్లో స్థిరపడాలంటే విద్యార్థులకు పదవతరగతి పునాది లాంటిదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్ష లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు మంగళవారం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వాల్గొ్ట్ కిషన్ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలను అందజేశారు. జీపీఏ సాధించిన 9 మంది విద్యార్థులు భారద్వాజ్, స్వాతి, వర్సిత , వందన , సుఫియా హస్నా, వరలక్ష్మి , రాహుల్ , రష్మిత , ఆర్కర్ శివరాజ్ ల కు ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ బుక్లేట్స్, నగదు, శాలువాలతో ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్ రాజురా సత్యం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.