MLA Vedma Bojju Patel: పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌,కడెం
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* సైన్స్ ల్యాబ్ గదుల నిర్మాణ పనులకు భూమి పూజ

విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమ‌వారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో నూతన కేజీబీవీ పాఠశాల, నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో సైన్స్ ల్యాబ్ గదుల నిర్మాణ పనులకు భూమీ పూజ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలతో నిర్మాణ పనులను చెపడుతొందన్నారు. పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించడం జరుగుతోందన్నారు.విద్య వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు.పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *