సిరాన్యూస్, ఆదిలాబాద్
రిమ్స్ ఆస్పత్రిలో రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని ఆదివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సందర్శించారు.పలు వార్డులో తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు ఆయన సూచించారు.అదేవిధంగా రోగులకు మెను ప్రకారం ఆహారం అందేలా చూడాలని కోరారు.ఆయన వెంట యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ఉన్నారు.