MLA Vedma Bojju Patel: చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటాం:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఇంద్రవెల్లి
చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటాం:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* బాధిత కుటుంబానికి రూ.20వేలు అంద‌జేత

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తండా గ్రామానికి చెందిన వాగ్మారే దీక్ష ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి గుండె పోటుతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.చిన్నారులను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించాలని కుటుంబ సభ్యులకు సూచనలు చేశారు.ఈ సందర్బంగా బాలల సంరక్షణ అధికారితో మాట్లాడి చిన్నారుల స్థితిగతులను వివరించారు.1 సంవత్సరం పాటు సంరక్షణ కేంద్రంలో ఉంచి చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు చిన్నారులను బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులతో పాటు అధికారులు సూచించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే తనవంతుగా రూ. 20 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *