సిరాన్యూస్, ఉట్నూర్
కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఎమ్మెల్యేను కలిసిన డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం
కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి,పుష్ప గుచ్చం అందజేశారు.అనంతరం ఎమ్మెల్యేతో సమావేశమై కళాశాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకోచ్చారు.కళాశాలలో ప్లే గ్రౌండ్,ప్రహరీ గోడ,స్పోర్ట్స్ కిట్స్, కంప్యూటర్ లను కళాశాలకు మంజూరు చేయాలని కోరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పంచాయతీ రాజ్ డిఈ కి ఫోన్ లో మాట్లాడి కళాశాల ప్రిన్సిపాల్ తో కలసి కళాశాలలో ప్లే గ్రౌండ్, ప్రహరీ గోడ కు సంబంధించిన అయ్యే వ్యయం ఖర్చుల నివేదికలను తనకు అందజేయాలని సూచనలు చేశారు.స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ ను కలసి కళాశాలలో స్పోర్ట్స్ కిట్లు మంజూరు అయ్యే విధంగా చర్యలు చెపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
