సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
నిందితుడిపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* బాధితురాలికి పరామర్శ
* బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ బాధితురాలిని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.డాక్టర్ లతో మాట్లాడి మహిళ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచనలు చేశారు. మహిళపై జరిగిన ఘనటను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని,నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.