MLA Vedma Bojju Patel: నిందితుడిని జైలుకు పంపాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఉట్నూర్
నిందితుడిని జైలుకు పంపాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఇరు వర్గాల ప్రజలు సంయమనం పాటించాలి
* జైనూర్ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జైనూర్ మండలంలో ఓ మహిళపై అఘాత్యానీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని జైలుకు పంపారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జైనూర్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన బాధాకరమని అన్నారు.జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు సీతక్క డిజీపితో మాట్లాడి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.ఇరు వర్గాలు సంయమనం పాటించాలన్నారు. ఆదివాసీలను అడ్డంపెట్టుకొని కొందరు ప్రశాంతవంతమైన వాతావరణాన్ని చెడగొట్టే కుట్ర పన్నుతున్నారని,ఈ ఘటనలో బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు హస్తం ఉందన్నారు.అమాయక ఆదివాసీ యువతను మభ్యపెట్టి వారి జీవితాన్ని సర్వ నాశనం చేయడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, ఆదివాసీ యువత ఎవరో చెప్పిన మాటలు విని ఆగం కావొద్దని విజ్ఞప్తి చేశారు.సార్మెడీలు,పటేల్లు, ఆదివాసీ యువతకు మంచి మార్గం వైపు నడిపించాలని కోరారు.ఘటన జరగడానికి ముందు డిఎస్పీ వ్యవహరించిన తిరును డీజీపికి తెలుపుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై బురద జెల్లడానికి బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి హింసాత్మాకమైన ఘటన జరగడానికి కారకులైనారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *