MLA Vedma Bojju Patel: ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్ , ఇంద్రవెల్లి
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన
* వాగుదాటి గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని
* కోతకు గురైన రోడ్ల, పంట పొలాల పరిశీలన
* డిఈతో మాట్లాడి తాత్కాలిక రోడ్లు వేయాలని ఆదేశం

ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని,రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్లను ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఆంజి గ్రామంలో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చట్టించి బోర్డుపై ప్రశ్న ఇచ్చి సమాధానం రాబట్టు కున్నారు.పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం 15 లక్షలు మంజూరు చేశారు.అనంతరం వడగావ్ గ్రామంలో పర్యటించారు.జెండా గూడా గ్రామస్తులు ఎమ్మెల్యేను కలసి బ్రిడ్జి నిర్మాణం చేయాలనీ కోరగా.. డిఈతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చుల నివేదికలు తమకు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామస్తులతో కలసి వాగు దాటి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.లాల్-టెక్డి సమీపంలోని కోతకు గురైన రోడ్డును పరిశీలించారు.జిల్లా కలెక్టర్ రాజర్షిషా తో ఫోన్ లో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని కోరారు.రాకపోకల కోసం తాత్కాలిక రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు.పంట పొలంలోకి వెళ్లి రైతుతో మాట్లాడి పంట నష్టంపై అరా తిశారు.అనంతరం పాఠశాలను సందర్శించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని,రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ తో మాట్లాడి రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.రైతు రుణమాఫీ విషయంలో రైతులేవరు ఆందోళనకు గురి కావొద్దని, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *