MLA Vedma Bojju Patel: పేదల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్దపీట:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
పేదల సంక్షేమానికి ప్ర‌భుత్వం పెద్దపీట:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌
* గ్యాస్ సబ్సిడీ పత్రాలు లబ్ధిదారుల‌కు అంద‌జేత‌

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో మహాలక్ష్మి పథకం కింద మంజూరైన గ్యాస్ సబ్సిడీ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని,ప్రతి పేదవాడికి సంక్షేమా ఫలాలు అందేలా చర్యలు చేపడుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ చెప్పేది చేస్తదని చేసేది చెప్తుందని పేర్కొన్నారు.ఇచ్చిన మాట ప్రకారం గృహ జ్యోతి పథకంలో ప్రతి మహిళకు 500 కే గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు.ఈ పథకం యొక్క లక్ష్యం మహిళ సాధికారత అని ఈ పథకం ద్వారా దారిద్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *