MLA Vedma Bojju Patel: గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, జన్నారం
గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* జ‌న్నారంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు భూమి పూజ‌

గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంతో పాటు మొర్రిగూడ, కిష్టాపూర్-మన్నెగూడ,కామన్ పల్లి, మందపల్లి, పోన్కల్, శ్రీలంక కాలనీ తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. డిఎంఎఫ్టి నిధులతో 2కోట్ల 16 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు,మురికి కాలువల,ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమి పూజలు చేశారు.ఐటిఐ కళాశాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.కామన్ పల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నేరవేరుస్తుందని తెలిపారు.దశల వారీగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపిట వేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *