సిరాన్యూస్, జన్నారం
కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు దిష్టిబొమ్మను దహనం చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* రవ్నీత్ సింగ్ బిట్టుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్యలు తీసుకోవాలి
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం టీపిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ ను తీవ్రవాది అంటూ బీజేపీ నేత రవ్నీత్ బిట్టు చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోని,కేంద్ర మంత్రి పదివికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీ పార్టీ కుల,మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రశాంతవంతమైన వాతావరణంను చెడగొట్టి దేశంలో భయానక వాతావరణంను సృష్టించడానికి కుట్రకు పన్నుతుందన్నారు.రాహుల్ గాంధీపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ ఆ నాయకున్ని పార్టీ నుండి తొలగించి, ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ,ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.