సిరా న్యూస్,ఇంద్రవెల్లి
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* బాలాజీ మందిర ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం
అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్ నగర్ గ్రామంలో టీటీఢృ 10 లక్షల నిధులతో బాలాజీ మందిర ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని పేర్కొన్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.సబ్బండ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు పాటు పడుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.