సిరాన్యూస్, ఉట్నూర్
శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జైనూర్ లో జరిగిన ఘటనపై రెండు రోజుల పాటు రాయిసెంటర్ సార్మెడిలు,రాజ్ గోండు సేవా సమితి,అన్ని ఆదివాసీ సంఘాలు,మైనారిటీ మత పెద్దలతో చర్చించిన విషయాలపై సిఎం రేవంత్ రెడ్డీ,గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ను జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కతో కలసి పూర్తి నివేదికలను అందించామని పేర్కొన్నారు.త్వరలో గవర్నర్ అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారనీ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డితో రాయి సెంటర్, రాజ్ గోండు సేవా సమితితో పాటు అన్ని ఆదివాసీ సంఘాలను కల్పిస్తామన్నారు.జైనూరు ఘటన బాధితురాలికి న్యాయం చేస్తామని అన్నారు.ప్రతి రోజు ఆమె ఆరోగ్య పరిస్థితులను మంత్రి సీతక్క డాక్టర్లతో మాట్లాడి తెలుసుకుంటున్నారన్నారు.ఆ మహిళకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలను అందిస్తోందనీ తెలిపారు. ఇరు వర్గాల వారు సంయమనం పాటించాలని కోరారు. ఆదివాసీల ఉద్యమాలు అర్థవంతమైనవిగా ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.నాన్ ట్రైబల్ లు 5వ షెడ్యూల్ లోనీ చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను భంగం కలగకుండా ఉండాలని సూచించారు.