సిరాన్యూస్, ఉట్నూర్
చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* త్వరలో ఉట్నూర్ కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు
తాడిత పిడిత వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ నిరంతరం పోరాడారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.భూపోరాటానికి నాంది పలికిన వీర వనిత చాకలి ఐలమ్మ అని సబ్బండవర్గాల కోసం ఆ మహనీయురాలు చేసిన త్యాగం వెలకట్టలేనిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆ పోరాటం అందరికి స్ఫూర్తినిస్తోందన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ లో చాకలి ఐలమ్మ వారసురాలికి చోటు ప్రభుత్వం చోటు కల్పించిందని తెలిపారు.రజక సమాజ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.భవిష్యత్తు తరాలు బాగు పడాలంటే ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.సంకల్పం గొప్పదై ఉండాలని ఏదైనా సాదించవచ్చని పేర్కొన్నారు. త్వరలో అర్హులైన ప్రతి పేద వాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు.200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తున్నామని, సమస్యల పరిష్కారం కోసం పొద్దు పొడుపు భోజ్జన్న అడుగు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామన్నారు.ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.