సిరాన్యూస్, ఇంద్రవెల్లి
చిరు ధాన్యాలను పండించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
* రసాయన మందులు,ఎరువుల,వాడకాలను పూర్తిగా మానేయాలి
అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి రైతులు తమ పంట పొలాలలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని,తద్వారా భూసారం పెరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గల రైతు వేదిక భవనంలో ఐకార్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందుగా వ్యవసాయ పనిముట్ల స్టాళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న పంటలను రైతులు మళ్లీ పండించాలన్నారు.శాస్త్రవేత్తలు గ్రామీణ ప్రాంతాలలో గల రైతులకు పంట సాగు విధానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.వారంలో కనీసం రోజుల పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తినాలని సూచించారు. రక్తహీనతను అరికట్టేందుకు ,ఇప్పపువ్వు లడ్డు, ఎంతో శ్రేయసకరమన్నారు. రసాయనాల వాడకం వల్ల భూసారం తగ్గి పంటలు సరిగా పడడం లేదని అన్నారు.మనం తినే తిండి విషంతో సమానమని, రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలన్నారు. మానవాళి తప్పిదం వల్ల ఓజోన్ పోరా దెబ్బతిని మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు.అసెంబ్లీలో ప్రస్తావన చేస్తామని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సంస్థలకు, ఎన్జీవోలకు చేయూతనందించి రైతులకు మేలు చేస్తామన్నారు. శాస్త్రవేత్తలు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ పంటలు పండించే విధానాన్ని – ఎరువుల వాడక పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు.కార్యక్రమంలో ఐకార్ శాస్త్రవేత్తలు డా. వికే సింగ్, మనోరంజన్, నర్సింహులు, సంజీవ్ రెడ్డి, శ్రీధర్, భారత్ కుమార్, అశోక్, ఆశిష్ రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.