సిరాన్యూస్, ఉట్నూర్
జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* క్రీడల నిర్వహణకు నిధులు కేటాయింపు
* ఉట్నూర్‌లో జోనల్ స్థాయి క్రీడ పోటీలు ప్రారంభం
గిరిజన పాఠశాల,కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలోను రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కేబి కాంప్లెక్స్ లో గల క్రీడా మైదానంలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించారు.అనంతరం ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తాతో జాతీయ పతకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్రీడాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాల బడ్జెట్ను రూపాయి 325 కోట్లు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దని చెప్పారు.ఈ ఏడాది అక్టోబర్ లో పెద్ద ఎత్తున సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలల క్రీడల నిర్వహణకు ,ఎస్ జి ఎఫ్ ,క్రీడల నిర్వహణకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు.అదేవిధంగా పాఠశాల గ్రాండ్లలోనూ క్రీడలకు ప్రతి పాఠశాలకు రూపాయలు 25000 పెంచిన ఘనత తమ ప్రభుత్వాన్నిదని తెలిపారు.ఈ ఏడాది గిరిజన రాష్ట్రస్థాయి క్రీడలను ఏర్పాటు చేశామని వివరించారు.ఐటీడీఏ పిఓ మారుమూల గ్రామాల్లో ఎడ్లబండిపై సందర్శించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆసిసెంట్ కలెక్టర్ సంకేత్, అధికారులు,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.