MLA Vedma Bojju Patel: రైతులు మోసపోకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

సిరాన్యూస్‌, ఆదిలాబాద్ :
రైతులు మోసపోకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

పత్తి కొనుగోలు విషయంలో రైతులు దళారుల వ్యవస్థలో నష్టపోకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్ల సన్నదత ముందస్తు ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసే పత్తి విషయంలో దళారీ వ్యవస్థ జ్యోక్యం చేసుకోకుండా ఉండేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.దళారుల పైరవీలకు చెక్ పెట్టాలాని పేర్కొన్నారు.సన్నకారు రైతులకు న్యాయం చేయాలని సూచనలు చేశారు.ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి,ఉట్నూర్ పరిధిలోని రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.కొందరు దళారులు రైతుల నుండి తక్కువ ధరలకు పంటలను కొనుగోలు చేసి మోసం చేస్తున్నారని,అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు.బోనస్ విషయంలో రైతులేవరు ఆందోళన చెందొద్దని, ప్రతి రైతుకు బోనస్ ఇచ్చి న్యాయం చేస్తామన్నారు.ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్,ఏఎస్పీ,వ్యవసాయ శాఖ అధికారులు,జీనింగ్ మిల్ యాజమానులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *